News January 30, 2025

ఎమ్మిగనూరు: ‘తండ్రీకొడుకుల మృతికి కారణం ఇదే’

image

ఎమ్మిగనూరు మండలం బోడబండ దగ్గర బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో తండ్రీకొడుకు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే వారి మృతికి కారణమని మృతుల కుటుంబీకులు ఆరోపించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు ఓవర్ టేక్ చేయబోయి బైకును ఢీ కొట్టిందన్నారు. గురువారం గ్రామస్థుల అశ్రునయనాల మధ్య శ్యామేల్(30), గౌతమ్(2)ల అంత్యక్రియలు జరిగాయి.

Similar News

News February 18, 2025

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

image

కర్నూలులోని 4వ పట్టణ పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలు జరగకుండా నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

News February 17, 2025

కర్నూలులో 38°C ఉష్ణోగ్రత

image

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కర్నూలులో 38°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నంద్యాలలో 37°C ఉష్ణోగ్రత నమోదైంది.

News February 17, 2025

కర్నూల్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

కర్నూలులో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

error: Content is protected !!