News September 26, 2024

ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

image

ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలిని సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల్లో నిర్లక్ష్యంతో బేబీ డెత్‌కు కారణమైనట్లు ఆరోపణలు రావడం, సహచర వైద్యులతో విభేదాలు తలెత్తి ఒకరినొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో నిన్న విచారణ చేపట్టిన జిల్లా వైద్యాధికారి మాధవి.. నేడు మైథిలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News October 9, 2024

కర్నూలులో రూ.20కోట్లతో ఆహార పరీక్షా ల్యాబ్

image

రాష్ట్రంలో FSSAI ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రతి జిల్లాలోనూ ఆహార పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరగా FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ అఫీసర్ కమలవర్ధనరావు అంగీకరించారు. ఈ ఒప్పందం మేరకు రూ.20 కోట్లతో కర్నూలులోనూ ఇంటిగ్రేటేడ్‌ ఫుడ్‌ ల్యాబ్‌ను నెలకొల్పనున్నారు.

News October 9, 2024

సెలవుల వేళ పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలి: సీఐ గంగాధర్

image

దసరా పండుగ పురస్కరించుకొని గ్రామీణ ప్రజలు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని గోనెగండ్ల సీఐ గంగాధర్ సూచించారు. పండుగ సందర్భంగా పిల్లలు ఇంటి వద్ద ఉంటారని, వారు క్రిమిసంహారక మందులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. చెరువులు, కాలువల వద్దకు పంపకూడదని సూచించారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచిరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News October 8, 2024

బీజేపీ నుంచి ఆదోని మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

image

మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్‌‌ను BJP సస్పెండ్ చేసింది. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ షోకాజ్ నోటీసులు జారీ చేయగా రిప్లై ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ తెలిపారు. ప్రకాశ్ 1983లో అదోని నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉండగా సస్పెండ్ చేసింది.