News April 16, 2025
ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్లో 987 మార్కులు సాధించిన యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.
Similar News
News November 25, 2025
‘వేములవాడ రాజన్నా.. నీ సొమ్ము భద్రమేనా..?’

వేములవాడ రాజన్న స్వామి దేవస్థానం సొమ్ము భద్రమేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సత్తమ్మ అనే పత్తి రైతు ఆధార్ నంబర్కు రాజన్న ఆలయ ట్రస్టు బ్యాంకు ఖాతా లింకై ఉన్నట్లు వెలుగులోకి రావడంతో ఆలయ సొమ్ము భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వ్యక్తి ఆధార్ కార్డు ప్రభుత్వ అధీనంలో ఉండే ఆలయ ట్రస్టు ఖాతాకు అనుసంధానం కావడానికి కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. దీనిపై విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News November 25, 2025
జన్నారం: ‘ధాన్యంలో 17% లోపు తేమ ఉండాలి’

17% లోపు తేమ ఉంటేనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని జన్నారం మండలం దేవునిగూడెం క్లస్టర్ ఏఈఓ అక్రమ్ అన్నారు. మంగళవారం క్లస్టర్ పరిధిలోని దేవునిగూడెం, కామన్ పల్లి గ్రామ శివారులో ఎండకు ఆరబోసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రాత్రి వేళల్లో మంచి ఎక్కువగా పడుతుందని, దీంతో తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యంపై కవర్లను తప్పకుండా కప్పాలని రైతులకు ఏఈఓ అక్రమ్ సూచించారు.
News November 25, 2025
GHMC కౌన్సిల్ హాల్లో తగ్గేదే లే!

GHMC కీలక సమావేశానికి వేదికైంది. మరో 3 నెలల్లో పాలకవర్గం ముగియనుంది. మేయర్ అధ్యక్షతన నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, కొన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. చర్చల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని ప్రతిపక్షాలు, ధీటైన సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సభ్యులు కూడా తగ్గేదే లే అంటున్నారు.


