News June 23, 2024
ఎమ్మిగనూరు: సెంచరీ కొట్టిన టమోటా ధరలు

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి.రూ. 80 లోపు ఉన్న టమోటా ధర ఆదివారం ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్లో సెంచరీ కొట్టింది. టమోటా కేజీ ధర రూ. 100కు చేరుకోవడంతో సామాన్యులు కొనలేక బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి సబ్సిడీ కింద ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్లో సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 16, 2025
క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.
News December 16, 2025
కర్నూలు పోలీస్ స్పందనకు 108 ఫిర్యాదులు

ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీలు తెలిపారు. కర్నూల్ టూ టౌన్ పక్కన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రజల వినతులను స్వీకరించారు. PGRSకు సోమవారం 108 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, గల్లంతైన వ్యక్తులు, సైబర్ నేరాలు, కుటుంబ వేధింపులు, ఆస్తి వివాదాలు వంటి పలు సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.