News January 25, 2025
ఎమ్మెల్యేకు జ్ఞాపిక అందజేసిన ఆలయ నిర్వాహకులు

సంగారెడ్డి పట్టణంలోని శ్రీ విరాట్ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఆలయ నిర్వాహకులు జ్ఞాపికను అందజేశారు. ఈనెల 31వ తేదీ మాఘమాసం ఆరంభం నుంచి శ్రీవారి పుష్కరిణి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న దృష్ట్యా, ఉత్సవాలకు ఆలయ కమిటీ బాధ్యులు ఎమ్మెల్యేకు ఆహ్వానించారు. ఇందులో కమిటీ సభ్యులు డాక్టర్ అరుణ తదితరులు ఉన్నారు.
Similar News
News December 18, 2025
రేపు గవర్నర్‌తో భేటీ కానున్న జగన్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా రేపు మధ్యాహ్నం వైసీపీ అధ్యక్షుడు జగన్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. ప్రజలు చేసిన సంతకాల పత్రాలను గవర్నర్‌కి అందిస్తారని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు.
News December 17, 2025
నార్త్‌లో ఎందుకు.. సౌత్‌లో వేదికల్లేవా? ఫ్యాన్స్ ఫైర్

పొగమంచుతో 4వ టీ20 రద్దు కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. శీతాకాలంలో పొగమంచు కురిసే నార్త్ స్టేట్స్లో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంచు సమస్య ఉండే వేదికల్లో రాత్రి 7గంటలకు కాకుండా మధ్యాహ్నం మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పొగమంచు సమస్య తక్కువని ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్‌లు పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
News December 17, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤SKLM: ఆర్టీసీ కార్గో ద్వారా నేరుగా ఇళ్లకు పార్సిల్స్
➤సరుబుజ్జిలి: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
➤మహిళల ఆర్ధిక ఎదుగుదల ముఖ్యం: ఎమ్మెల్యే కూన
➤ఉపాధి హామీ పేరు మార్పు అన్యాయం: మాజీ కేంద్ర మంత్రి కిల్లి
➤ పలాసలో వివాదాలకు కారణం అవుతున్న ప్రభుత్వ భూములు
➤టెక్కలి: పెద్దసానలో కొండచిలువ కలకలం
➤ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే


