News October 11, 2024

ఎమ్మెల్యేలంతా వసూల్ రాజాలే: డీకే అరుణ

image

కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అక్రమ సంపాదనపై దృష్టిసారించి వసూల్ రాజాలుగా మారారని, ఇప్పటికే ప్రజలు గుర్తించారని MBNR ఎంపీ డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధన్వాడ BJP సభ్యత్వ నమోదులో ఆమె పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హాయంలో కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకుంటున్నారన్నారు.హైడ్రా పేరుతో వసూలుచేసి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని ఆమె ఆరోపించారు.

Similar News

News February 28, 2026

MBNR: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత: ఎస్పీ జానకి

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని, ప్రతి పౌరుడు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, సీఐలు శ్రీనివాస్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

News February 27, 2026

పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

image

TGSC స్టడీ సర్కిల్‌లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్‌లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

News February 27, 2026

MBNR: ‘ఆవిష్కరణలే లక్ష్యంగా గ్రాన్ టూరిస్మో 2.0’

image

పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.