News November 20, 2024
ఎమ్మెల్యేలకు మంత్రి సవిత విందు
బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఎమ్మెల్యేలకు విందు ఇచ్చారు. అమరావతిలోని తన నివాసంలో జరిగిన ఈ స్నేహపూర్వక విందుకు కూటమిలోని మహిళా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రుచికరమైన వంటలను వారికి వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ గ్రూప్ ఫొటో దిగారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న ముగియనుండటంతో మంత్రి సవిత ఈ ఆతిథ్యం ఇచ్చారు.
Similar News
News December 14, 2024
అనంత: స్నేహితుని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
స్నేహితుని హత్యకేసులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ అనంతపురం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2019లో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ మణికంఠను తన స్నేహితులు మద్యం మత్తులో దాడి చేసి హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
News December 14, 2024
అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు, దాడులు,ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వివరాలను ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం వెల్లడించారు. పేకాట, మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎం.వి కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై మోటారు వాహనాల చట్ట ప్రకారంగా 707 కేసులు నమోదు చేశారు. రూ. 1,72,816/- లు ఫైన్స్ వేశారు.
News December 13, 2024
అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు: MLA కాల్వ
అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ రాయదుర్గం MLA కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు అని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు రైతాంగానికి, సాగునీటి రంగానికి ఏమీ చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.