News September 25, 2024

ఎమ్మెల్యే ఆదిమూలం తమ్ముడు గుండెపోటుతో మృతి

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమ్ముడు కోనేటి పాండురంగం (68) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. నారాయణవనం మండలం భీముని చెరువుకు చెందిన కోనేటి పాండురంగంను రెండు రోజులక్రితం అస్వస్థతకు గురికావడంతో తిరుపతిలోని స్వీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 15, 2024

తిరుపతి: రేపు కూడా పాఠశాలలకు సెలవు

image

తిరుపతి జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి.శేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కాలేజీలకు కూడా వర్తిస్తుందన్నారు.

News October 15, 2024

తిరుపతి, చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు వీరే

image

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. కేబినెట్‌‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 15, 2024

తిరుపతి జిల్లా వ్యాప్తంగా సైక్లోన్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురిసే భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007,గూడూరు కంట్రోల్ రూమ్ నెం: 8624252807,సూళ్లూరుపేట-8623295345,
తిరుపతి ఆర్డీఓ 7032157040,శ్రీకాళహస్తి ఆర్డీఓ-కంట్రోల్ రూమ్ నెం:9966524952