News August 7, 2024
ఎమ్మెల్యే నల్లమిల్లికి భద్రత పెంపు

అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన పర్యటనలలో ప్రత్యర్థులు దాడులు చేసే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటి వరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న వ్యక్తిగత భద్రత సిబ్బంది (PSO’s) 1+1ను 2+2కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
Similar News
News November 17, 2025
రాజమండ్రి: శబరిమలైకు ప్రత్యేక బస్సులు

శబరిమల భక్తుల నుంచి ఆర్టీసీ బస్సులకు అమితమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి డిపో నుంచి సోమవారం ఐదు సూపర్ లగ్జరీ బస్సులు శబరిమల యాత్రకు బయలుదేరాయి. ఈ బస్సులు యాత్ర ముగించుకుని ఈ నెల 23న తిరిగి డిపోకు చేరుకుంటాయి. భక్తుల ఆదరణకు డిపో మేనేజర్ మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు కోరితే వారి గ్రామాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

తూ.గో: ఆశాజనకంగా ఆయిల్ ఫామ్ సాగు

తూ.గో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఎకరా సాగుకు పెట్టుబడి పోను రూ.1.50 లక్షలు ఆదాయం లభిస్తోందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో టన్ రూ.19,636 పలుకుతుంది. రూ.16 వేలు పైబడి ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట రూ.23 వేలు పైబడి ధర లభించింది. జిల్లా వ్యాప్తంగా 48,992 ఎకరాల్లో సాగవుతోందని ఉద్యాన అధికారి ఎన్. మల్లికార్జునరావు తెలిపారు.