News April 3, 2025

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె ఫోన్ హ్యాక్

image

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె ప్రత్తిపాటి స్వాతి ఫోను బుధవారం హ్యాక్ అయ్యింది. ఈ మేరకు డబ్బులు కావాలంటూ చిలకలూరిపేటలోని పలువురు ప్రముఖులకు వాట్సప్ సందేశాలను సైబర్ నేరగాళ్లు పంపించారన్నారు. నేరగాళ్లు ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే స్పందించవద్దని టీడీపీ సోషల్ మీడియా గ్రూపులలో సిబ్బంది మెసేజ్‌ పెట్టింది.

Similar News

News April 11, 2025

మంగళగిరి: చేబ్రోలు కిరణ్‌కు 14 రోజుల రిమాండ్

image

మంగళగిరి కోర్టు చేబ్రోలు కిరణ్‌కు 14రోజుల రిమాండ్ విధించింది. జగన్‌ సతీమణిపై దూషణలకు పాల్పడ్డారనే కేసులో కిరణ్‌పై కేసు నమోదైంది. ఈ సందర్భంగా కేసులో 111సెక్షన్‌ను లాగడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని ఇష్టానుసారంగా వాడటాన్ని తప్పుబడుతూ మంగళగిరి సీఐ శ్రీనివాసరావుపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐకి ఛార్జ్‌మెమో ఇవ్వాలని, లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

News April 11, 2025

గుంటూరు: హైదరాబాద్‌కు 4లైన్ నేషనల్ హైవే

image

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నేషనల్ హైవేల పనులు వేగవంతమయ్యాయి. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా మీదుగా బాపట్ల జిల్లాకు వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు 167ఏ జాతీయ రహదారి రూ.1,064.24 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాది ఆఖరికి హైవే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలను కలుపుతూ 4లైన్‌ల హైవేను హైదరాబాద్‌కు నిర్మించే పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్టు సమాచారం. 

News April 11, 2025

మంగళగిరిలో అభివృద్ధి పరంపరకు కొనసాగింపు 

image

మంగళగిరిలో అభివృద్ధి పరంపరకు కొనసాగింపుగా, 1986లో ఎన్టీఆర్ శంకుస్థాపన చేసి పూర్తిచేసిన ప్రభుత్వ హాస్పిటల్‌కి, నేడు మంత్రి లోకేశ్ మరో మెరుగైన రూపాన్ని అందిస్తున్నారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన లోకేశ్, ఈ ఆసుపత్రిని ఒక ఏడాది వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అన్న విషయాన్ని ఈ ఉదాహరణ బలంగా చాటుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

error: Content is protected !!