News September 17, 2024
ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్
తమ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దర్శిలో నేడు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉదయం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మకు నోటీసులు అందజేసి గృహ నిర్బంధం చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు సూచించారు. వారితో పాటు, టీడీపీ నాయకులకు సైతం నోటీసులు ఇచ్చారు.
Similar News
News October 7, 2024
రేపు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాక
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లుగా ఆదివారం మాగుంట కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు స్థానిక రామ్ నగర్‌లో మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. 11 గంటలకు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో జరిగే స్వర్ణాంధ్ర – 2047 జిల్లా స్థాయి విజన్ సంప్రదింపులు, సలహాల సమావేశానికి హాజరవుతారన్నారు.
News October 7, 2024
ఒంగోలు పోలీసులు కొట్టడం వల్లే రాజశేఖర్ చనిపోయారు: నాగేంద్ర
ఒంగోలు టూ టౌన్ పోలీసులు కొట్టి అవమానించడం వల్లనే పరుచూరి రాజశేఖర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆరోపించారు. ఆదివారం ఒంగోలులోని GGHలో రాజశేఖర్ మృతదేహాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరగాలని.. మృతుడి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News October 6, 2024
ఒంగోలు: డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం ఈనెల 9లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా డిగ్రీ ప్రవేశాలు పొందని ఇంటర్ విద్యార్థులు ఈఅవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు.