News February 14, 2025

ఎమ్మెల్యే వేముల వీరేశం LOVE STORY మీకు తెలుసా..?

image

FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. నకిరేకల్ MLA వీరేశం, పుష్ప దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేసే సమయంలో ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే కావడంతో కలిసి బతకాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగినవి కావడంతో పెద్దల అంగీకారంతో ఆనాడు వారు పనిచేస్తున్న ఉద్యమ సంస్థే వీరి పెళ్లి జరిపించింది.

Similar News

News November 10, 2025

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి వినతులు

image

పీజీఆర్ఎస్‌లో వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పెద్దపంజాణి మండలానికి చెందిన లక్ష్మీదేవి వన్ బీ కోసం, బొమ్మసముద్రం చెందిన భువనేశ్వరి వితంతు పింఛన్ కోసం, పీసీ గుంటకు చెందిన గుర్రప్ప పట్టాదారు పాసు పుస్తకం కోసం వినతి పత్రాలు ఇచ్చారు. మొత్తం 301 ఫిర్యాదులు వచ్చాయి.

News November 10, 2025

మంచిర్యాల: రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

2026-26 సం.నికి ధాన్యం కొనుగోలు జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ నం.6303928682 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో 1967, 180042500333 నంబర్లకు సంప్రదించాలన్నారు.

News November 10, 2025

ములుగు: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల వివరాలు

image

జిల్లాలో 2025-26కు గాను నూతన కొనుగోలు కేంద్రాలు 185 ఏర్పాటు చేశామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మొత్తం 1,722 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 17% తేమతో 578, మిల్లుకు రవాణా చేసిన ధాన్యం 578 మెట్రిక్ టన్నులని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు 1,843 టార్పాలిన్, 5,35,248 ఖాళీ బస్తాలు సరఫరా చేశామన్నారు. ఇంకా 1,857 టార్ఫాలిన్, 22,96,557 ఖాళీ బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు.