News January 29, 2025

ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై మంత్రికి ఫిర్యాదు

image

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు, జనసేనపార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపురాందాస్ చౌదరి మంత్రికి ఫిర్యాదుచేశారు. మదనపల్లె ఎమ్మెల్యే వలస వచ్చినవారిని రేషన్ డీలర్లుగా నియమించడం, టౌన్ బ్యాంకు ఎన్నికల్లో వైసీపీలోని నలుగురిని డైరెక్టర్లుగా నియమించి కార్యకర్తలకు అన్యాయంచేశారని అన్నమయ్య జిల్లా ఇంఛార్జి మంత్రి బీసీ జనార్దనరెడ్డికి ఫిర్యాదుచేశారు. 

Similar News

News January 9, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 9, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.22 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 9, 2026

నిర్మల్: ఇంటర్ పరీక్షకు 13,125 మంది విద్యార్థులు

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 6,652 మంది ప్రథమ, 6,473 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 13,125 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు వివరించారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

News January 9, 2026

ఈడీ vs ఐప్యాక్: హైకోర్టుకు చేరిన వివాదం!

image

కోల్‌కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ED చేసిన <<18797775>>రెయిడ్స్‌<<>>పై రోజంతా హైడ్రామా నడిచింది. మమత వర్సెస్ ఈడీ అన్నట్లు సాగిన ఈ వ్యవహారం చివరికి కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ, ఐప్యాక్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. బెంగాల్ కోల్ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి తాము సోదాలు చేశామని, తమను మమత అడ్డుకున్నారని ఈడీ తమ పిటిషన్లో పేర్కొంది. ఈడీ రెయిడ్స్‌ను ఆపేలా ఆదేశించాలని ఐప్యాక్ అభ్యర్థించింది.