News September 11, 2024
ఎమ్మెల్యే 3 నెలల వేతనం విరాళం

సీఎం సహాయ నిధికి తన 3 నెలల వేతనం రూ.5 లక్షలు, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు ఇచ్చిన మరో రూ.5 లక్షల విరాళంతో కలిపి మొత్తం రూ.10 లక్షలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సీఎం చంద్రబాబుకు అందజేశారు. అనంతరం విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తనకు కేటాయించిన వార్డులో పర్యటించి, వారి కష్టాలు తెలుసుకున్నారు.
Similar News
News February 25, 2026
ఉపాధి పనులు శనివారంలోపు ప్రారంభించాలి: కలెక్టర్

ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.
News February 24, 2026
కర్నూలు: ఇంటర్ పరీక్షలకు 297 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 297 మంది విద్యార్థులు హాజరు కాలేదని రీజనల్ ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్ లాలప్ప తెలిపారు. మొత్తం 21,147 మంది విద్యార్థులకు గానూ 21,174 మంది పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన స్పష్టం చేశారు.
News February 24, 2026
కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

మంత్రులు రామానాయుడు, టీజీ భరత్ సమక్షంలో కర్నూలు జిల్లా అభివృద్ధిపై కీలక సమీక్ష జరిగింది. కలెక్టర్ డా.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎంపీ నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అవసరాలపై నివేదికలు సమర్పించారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు నాయుడితో జరిగే భేటీ కోసం పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు.


