News February 11, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కడెం వాసి

image

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన నేదూరి జీవన్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట విద్యార్థి సంఘ నాయకులు, తదితరులున్నారు.

Similar News

News December 16, 2025

జంగారెడ్డిగూడెం: లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు

image

జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలికపై ఆమె మారుతండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ముద్దాయిపై రౌడీ షీట్ కూడా తెరుస్తున్నామని పోలీసులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

News December 16, 2025

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

image

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.

News December 16, 2025

నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

image

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.