News March 10, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.
Similar News
News January 22, 2026
10సెకన్లలో హార్ట్ అటాక్ ముప్పు గుర్తించే సెన్సర్..

హార్ట్ అటాక్ ముప్పును 10సెకన్లలోనే గుర్తించే స్పెషల్ సెన్సర్‌ను బనారస్ హిందూ యూనివర్సిటీ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. రక్తంలోని C-రియాక్టివ్ ప్రొటీన్(CRP) లెవెల్స్‌ను వేగంగా, కచ్చితంగా కొలిచే ఇంపెడిమెట్రిక్ సెన్సర్‌ను తయారుచేశారు. మిల్లీలీటరుకు 0.5నానోగ్రామ్స్ ఉన్న CRP లెవెల్స్‌ను కూడా ఈ సెన్సర్ గుర్తిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెస్టులు ప్రీమియంతోపాటు రిజల్ట్ కోసం ఎక్కువ సమయం వేచిఉండాలి.
News January 22, 2026
నాలుగో మేయర్ కోసం NZB నగరం ఎదురు చూపు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు మేయర్లు పనిచేశారు. ప్రస్తుతం నాలుగో మేయర్ కోసం నగరం ఎదురు చూస్తోంది. మొదటి మేయర్‌గా కాంగ్రెస్ నుంచి ధర్మపురి సంజయ్, రెండో మేయర్‌గా ఆకుల సుజాత (BRS), మూడో మేయర్‌గా దండు నీతూ కిరణ్ (BRS) పని చేయగా నాలుగో మేయర్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
News January 22, 2026
గాజువాక జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్

జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఉండగా ఇంజినీరింగ్ విభాగం సెక్షన్ ఇంజినీర్ గోవింద్ రాజు కుప్ప కూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తోటి ఉద్యోగులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


