News March 10, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీచేసి ఓడిపోయారు. ఆమె బీజేపీలోనూ పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు.
Similar News
News March 10, 2025
పుష్ప-2 లాభాలను దానికోసం వాడేలా చూడండి: హైకోర్టులో పిల్

TG: పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను చిన్న బడ్జెట్ సినిమాల రాయితీకి ఉపయోగించాలని నరసింహారావు అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం లాభాలను కళాకారుల సంక్షేమానికి వాడాలని అందులో కోరారు. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన పుష్ప-2 అన్ని భాషల్లో కలిసి రూ.1800 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.
News March 10, 2025
MDK: సినిమాల్లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుని ‘ఏ వార్ ఆఫ్ లవ్ ‘ అనే ప్రేమ కథా చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఆ మూవీకి సంబంధించి పోస్టర్ కూడా విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రం రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
News March 10, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయన వెంట జాయింట్ కలెక్టర్ కార్తీక్, తదితరులు ఉన్నారు.