News March 10, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

image

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆమె బీజేపీలోనూ పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు.

Similar News

News March 16, 2026

కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. 77 మందికి జరిమానాలు

image

కామారెడ్డి జిల్లాలో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 77 మందికి కోర్టు శిక్షలు విధించింది. వారిలో ఏడుగురికి ఒక రోజు జైలు శిక్ష విధించగా మొత్తం ₹95,500 జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. క్షణికానందం కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దన్నారు. ప్రజల భద్రతే తమ లక్ష్యమని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు.

News March 16, 2026

GNT: గ్యాస్ సరఫరాపై అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

image

ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, పారదర్శక సేవలు అందించాలన్నారు.

News March 16, 2026

ఎనుమాముల మార్కెట్‌కు వరుస సెలవులు

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 19, 21, 22న సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఉగాది, రంజాన్ పండుగలు, ఆదివారం వారంతపు సెలవు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, మధ్యలో ఈనెల 20న మార్కెట్ యార్డ్ యథావిధిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. సెలవుల అనంతరం ఈ నెల 23న మార్కెట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని, రైతులు, వ్యాపారులు గమనించాలని సూచించారు.