News February 25, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థులతో విశాఖ కలెక్టర్ సమావేశం 

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వహించేందుకు అభ్య‌ర్థులు పూర్తి సహాయ స‌హ‌కారాలు అందించాల‌ని రిట‌ర్నింగ్ అధికారి, క‌లెక్ట‌ర్ హరేంద్ర ప్ర‌సాద్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం ప్రచార ప్ర‌క్రియ గ‌డువు ముగిసిన వెంట‌నే పోటీలో ఉన్న అభ్య‌ర్థులు అనుసరించవలసిన విధానాలపై వారికి వివరించారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుపై పలు సూచనలు చేశారు.

Similar News

News December 1, 2025

విశాఖ: ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

image

విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారి స్వయం ఉపాధి కోసం మహిళలకు కలెక్టర్ చేతుల మీదుగా కుట్టు మిషన్‌లు అందించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలసి కలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు. చిన్నారులతో మాట్లాడి వారి చదువు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

News December 1, 2025

పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్

image

సింహాచలం దేవస్థాన పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని నిర్వసితులు డిమాండ్ చేశారు. ఆదివారం సింహాచలంలో నిర్వసితులు ధర్నా నిర్వహించారు. పంచగ్రామాల సమస్య హైకోర్టులో కేసు ఉందన్న కారణంతో ప్రభుత్వాలు ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించడంలేదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీల కోసం వందల ఎకరాల దేవస్థానం భూములను కట్టబెడుతున్నారని, పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కనీసం చర్చించడం లేదని మండిపడ్డారు.

News November 30, 2025

రాజ్యాంగ రక్షణకు సైన్యం కావాలి: పరకాల ప్రభాకర్

image

భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవడానికి దళిత, బహుజన సైన్యం ఏర్పడాలని ప్రముఖ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. విశాఖలో అంబేద్కర్ భవన్‌లో ఆదివారం “భారతదేశ రాజకీయాలు- రాజ్యాంగ నైతికత సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ రాజధానిలో ఊర కుక్కలపై ఉన్న స్పందన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుతో దాడికి స్పందన రాకపోవటం విచారకరమన్నారు. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమేనన్నారు.