News March 11, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థులను చూసి షాకయ్యా: జగ్గారెడ్డి

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మైండ్ బ్లాంక్ అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఏం మాట్లాడాలో తెలియని షాక్ లో ఉన్నానాని, తానెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుందని, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను, నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
మెదక్: ‘బాల్య వివాహం జరిగితే సమాచారం ఇవ్వండి’

మెదక్ జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి
హేమ భార్గవి అధికారులు, ప్రజలకు విన్నవించారు. మండల, గ్రామ, తండాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఫంక్షన్ హాల్ యజమానులకు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్, పురోహితులు, పాస్టర్లు, ఖాజాలు, ప్రజలు జిల్లాలో ఎక్కడైనా వివాహం నిశ్చయం అవుతున్నట్లు తెలిసిన వెంటనే అమ్మాయికి, అబ్బాయికి వివాహ వయస్సు తెలుకోవాలన్నారు.
News November 16, 2025
MDK: వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే డబ్బులు మాయం

తూప్రాన్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన వాట్సప్ లింక్ ఓపెన్ చేస్తే రూ.27,100 మాయమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. ఓ వ్యక్తికి 12న వాట్సాప్కు వచ్చిన యోనో యాప్ లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేశాడు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.27,108 నుంచి, 27,100 డెబిట్ చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వ్యక్తి 1930 కాల్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు.
News November 16, 2025
మెదక్: దరఖాస్తుల ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో అందించే పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నిర్వాహకుల నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17 వరకు https://wdsc.telangana.gov.in సమర్పించాలని సూచించారు.


