News December 26, 2024

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలుగుబెల్లి భాగ్యమ్మ ఉదయం 5గం.లకు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమె మృతి పట్ల టీఎస్ యుటీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, అనీల్, జిల్లాలోని మండల శాఖల పక్షాన సంతాపం ప్రకటించారు. 

Similar News

News November 10, 2025

నల్గొండ: ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష

image

ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నల్గొండ జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ.160 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొన్నారని వివరించారు. పత్తి కొనుగోళ్ల కోసం అదనంగా తేమ కొలిచే యంత్రాల కొనుగోలుకు మంత్రి తుమ్మల ఆదేశించారు.

News November 10, 2025

NLG: ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టండి: కలెక్టర్‌

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కారం కావాలని, ఏ ఒక్క దరఖాస్తును కూడా పెండింగ్‌లో ఉంచవద్దని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News November 10, 2025

NLG: ర్యాగింగ్‌పై ఉక్కుపాదం: ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

image

ర్యాగింగ్‌ అనే విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడి తోటి విద్యార్థుల జీవితాలను నాశనం చేయవద్దని, అలా చేస్తే, ప్రొహిబిషన్‌ ర్యాగింగ్‌ యాక్ట్‌ కింద 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.