News December 26, 2024

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలుగుబెల్లి భాగ్యమ్మ ఉదయం 5గం.లకు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమె మృతి పట్ల టీఎస్ యుటీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, అనీల్, జిల్లాలోని మండల శాఖల పక్షాన సంతాపం ప్రకటించారు. 

Similar News

News January 26, 2025

కనగల్ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి MASTER PLAN

image

దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ విస్తరణ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఎండోమెంట్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆలయాన్ని సందర్శించారు. సుమారు రూ.4కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో స్థపతి శ్రీ వల్లి నాయర్, దుర్గాప్రసాద్, గణేశ్, కిరణ్, ఆలయ ఛైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, ఈవో జల్లేపల్లి జయరామయ్య, దేప కరుణాకర్ రెడ్డి ఉన్నారు.

News January 26, 2025

నల్లగొండ: MGU మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

News January 26, 2025

నల్గొండ: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 26 నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పథకాల అమలుకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ పథకాల అమలుకై గ్రామ, వార్డుసభలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.