News January 30, 2025

ఎమ్మెల్సీ ఎన్నికకు సహకరించాలి: కలెక్టర్

image

కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కోడ్ అమలుకు సహకరించడంతోపాటు శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.

Similar News

News November 5, 2025

పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

image

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

News November 4, 2025

కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

image

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.

News November 4, 2025

జగన్ కాన్వాయ్‌ను అనుసరిస్తుండగా బైక్ ప్రమాదం

image

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా ప్రమాదం జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్న జగన్ కాన్వాయ్‌ను బైక్‌పై అనుసరిస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలోని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.