News January 30, 2025
ఎమ్మెల్సీ ఎన్నికకు సహకరించాలి: కలెక్టర్

కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కోడ్ అమలుకు సహకరించడంతోపాటు శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.
Similar News
News February 12, 2025
కృష్ణా: RTC బస్సులో తండేల్ సినిమా.. కొనకళ్ల స్పందన

ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ స్పందించారు. 9వ తేదీన పలాస నుంచి విజయవాడ వస్తున్న బస్సులో సినిమా ప్రదర్శించినట్లు కంప్లైంట్ వచ్చిందని ఆయన చెప్పారు. అలా ప్రదర్శించడం అనేది తప్పని ఆయన ఖండించారు. దీనిపై ఎంక్వయిరీ జరుగుతుందని తెలిపారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
News February 12, 2025
బాపులపాడు: అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

అత్యాచారం కేసులో నిందితుడికి మచిలీపట్నం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. 2021లో మల్లవల్లి గ్రామంలో కాసులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 10 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
News February 12, 2025
కృష్ణా: టెన్త్ అర్హతతో 67 ఉద్యోగాలు

టెన్త్ అర్హతతో కృష్ణా జిల్లా డివిజన్‌లో 67 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.