News February 26, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు టోల్ ఫ్రీ నెంబర్లు: కలెక్టర్

తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలోని ఓటర్ల సౌలభ్యం నిమిత్తం హెల్ప్ లైన్ నంబర్లను ఏలూరు కలెక్టర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేశామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. 1950, 949-104-1419, టోల్ ఫ్రీ నంబర్ 18002331077 లను ఎన్నికల ఓటర్లు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News December 16, 2025
VKB: ఓట్ల కోసం వస్తూ యువకుడి మృతి

ఓట్ల కోసం వస్తూ ప్రమాదంలో యువకుడు మరణించిన ఘటన కుల్కచర్ల మండలంలోని బండమీది తండాలో జరగింది. పోలీసుల ప్రకారం.. HYD శేర్లింగంపల్లి నుంచి ఓట్లు వేసేందుకు సొంత గ్రామానికి వస్తుండగా బైకును టిప్పర్ ఢీకొని మరణించాడు. ఎన్నికలు జరుగుతున్న వేళ గ్రామంలో యువకుడు మరణించడంతో విషాదచాయలు అమ్ముకున్నాయి. ఓట్లు వేసేందుకు తాండా ప్రజలు ఆసక్తి చూపించడం లేదని ప్రజలు పేర్కోటున్నారు.
News December 16, 2025
NZB: కాల్పుల ఘటన.. అనుమానితుల ఫొటోలు విడుదల

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి తండా వద్ద మంగళవారం జరిగిన <<18584756>>కాల్పుల ఘటనపై అనుమానితులను<<>> స్థానికులు గుర్తించారు. అయితే దేవి తండా పరిసర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు గమనించి ఫొటోలు తీశారు. ఫొటోల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ఇందల్వాయి పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
News December 16, 2025
BHPL: సర్పంచులుగా గెలుపొందిన మాజీ ఎంపీపీలు

జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గణపురం, భూపాలపల్లి మండలాల తాజా మాజీ ఎంపీపీలు కావటి రజిత, మందల లావణ్య రెడ్డిలు సర్పంచులుగా విజయం సాధించారు. రజిత (కాంగ్రెస్) చెల్పూర్ సర్పంచ్గా, లావణ్య రెడ్డి (బీఆర్ఎస్) గొర్లవీడు సర్పంచ్గా గెలుపొందారు. ఎంపీపీ స్థాయి నుంచి సర్పంచులుగా గెలవడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.


