News February 5, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: NRML కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం NRML కలెక్టరేట్ సమావేశం మందిరంలో నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 21, 2025
జగిత్యాల: సేకరణ సరే.. చెల్లింపుల్లో జాప్యమెందుకు..?

జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 14 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో మొన్నటి వరకు 4,311 మంది రైతుల నుంచి రూ.33.45 లక్షల విలువైన 1.39 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించారు. రైతుల నుంచి మొక్కజొన్నను సేకరించి 20రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే జమ అవుతాయని సంబంధిత అధికారులు అంటున్నారు.
News November 21, 2025
NZB: గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రైలులో గుట్కా ప్యాకెట్లు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు NZB రైల్వే సీఐ సాయిరెడ్డి తెలిపారు. GRP, RPF సిబ్బంది కలసి ఫ్లాట్ ఫారం నంబర్-1పై తనిఖీలు చేస్తుండగా NZB ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్ అనీస్ నిషేధిత టోబాకో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 80 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
News November 21, 2025
ఖమ్మం: మధ్యాహ్న భోజన వ్యయం పెంపు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుకింగ్ కాస్ట్’ను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ జీవో జారీ చేసింది. దీని ప్రకారం, ప్రాథమిక స్థాయి విద్యార్థికి ఖర్చు రూ.6.19 నుంచి రూ.6.78కి, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థికి రూ.11.79 నుంచి రూ.13.17కు పెరిగింది. హెచ్ఎంలు వెంటనే బిల్లులు పంపాలని ఆదేశించారు.


