News February 5, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: NRML కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం NRML కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.

Similar News

News March 17, 2026

MDK: 428 అంగన్వాడీలకు మహార్దశ

image

అంగన్వాడీలకు మహర్దశ రానుంది. అసౌకర్యాలకు నిలయంగా మారిన అంగన్వాడీలు బలోపేతం కానున్నాయి. తెలంగాణలో 5008 అంగన్‌వాడీలను ‘సక్షం’లో భాగంగా ఆధునికీకరించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా మెదక్‌లో 130, సంగారెడ్డిలో 298 అంగన్వాడీలు సక్షం సెంటర్లుగా ఎంపికయ్యాయి. ఎంపికైన కేంద్రాల్లో మెరుగైన వసతుల కల్పనతో పాటు డిజిటల్ విద్యా బోధన, LED స్క్రీన్ల ఏర్పాటు, పోషకాహారం అందనుంది.

News March 17, 2026

పెరగనున్న కార్ల ధరలు!

image

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.

News March 17, 2026

ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

image

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి లేదా ఆన్‌లైన్‌లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.