News January 30, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్: కలెక్టర్

image

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి కోరారు. బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరణ, ఫిబ్రవరి 10న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.

Similar News

News October 28, 2025

సూర్యాపేట: పోలీస్ వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

బాధితులకు వేగవంతంగా పోలీసు సేవలు అందించడంలో పోలీసు వాహనాలు కీలకమని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనాల నాణ్యతను, కండిషన్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించే వాహనాలు పూర్తి కండిషన్లో ఉండాలని, వాటిని ఎక్కువ కాలం ఉపయోగించేలా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారిని ఆదేశించారు.

News October 28, 2025

వనపర్తి: బాల్యవివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు

image

వనపర్తి జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ గిరిధర్‌తో కలిసి జిల్లా స్థాయి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 28, 2025

కాల్స్ అన్నీ రికార్డ్ చేస్తారంటూ ప్రచారం.. నిజమిదే

image

వాట్సాప్ కాల్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేసి సేవ్ చేస్తారని, సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తారంటూ సర్క్యులేట్ అవుతున్న నకిలీ పోస్టర్‌ను నమ్మొద్దని సూచించారు. ‘ఈ పోస్టర్‌లోని సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎవరూ షేర్ చేయొద్దు’ అని Xలో రాసుకొచ్చారు.