News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News March 21, 2025
మెదక్: విద్యార్థులకు అన్ని వసతులు: కలెక్టర్

పది పరీక్షలు జరిగే ప్రదేశాలలో 163 BNSS సెక్షన్ ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు 68 కేంద్రాలలో 10,388 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 3, సిట్టింగ్ స్క్వాడ్లు 17, చీఫ్ సూపరింటెండెంట్ 68, డిపార్ట్మెంటల్ అధికారులు 70, మంది 590 ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో ఏర్పాట్లు చేశామన్నారు.
News March 21, 2025
మెదక్: వైద్య సేవల బలోపేతానికి ప్రణాళిక: మంత్రి

ప్రభుత్వ హాస్పిటళ్లలో అధునాతన సౌకర్యాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్య ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
News March 21, 2025
మెదక్: టెన్త్ పరీక్షలకు అంతా రెడీ: డీఈవో

మెదక్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 10,388 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.