News February 27, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

Similar News

News December 20, 2025

పెదవులు పగులుతున్నాయా? ఇది కూడా కారణం కావొచ్చు

image

శీతాకాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగలడం కామన్. అయితే వాతావరణం వల్ల మాత్రమే కాదు, శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. విటమిన్ బి12 లోపం వల్ల ఈ సమస్య ఎదురవుతుందంటున్నారు. దీనికోసం మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు. శాకాహారులు పాలకూర, జున్ను, పాలు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో చేర్చుకోవచ్చని చెబుతున్నారు.

News December 20, 2025

T20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన

image

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది.

టీమ్: సూర్య (C), అక్షర్ పటేల్ (Vc), అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, రింకూ సింగ్, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, సుందర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్.
– వన్డే, టెస్ట్ జట్ల కెప్టెన్ గిల్‌కు చోటు దక్కలేదు

News December 20, 2025

నరసరావుపేట: అక్రమార్కుల్లో వణుకు.. PS వద్ద కార్లు పరార్.!

image

చిట్టినాయుడు కేసు దర్యాప్తు పల్నాడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాద కేసులో ప్రధాన నిందితుడైన చిట్టినాయుడు వద్ద నుంచి కార్లు కొనుగోలు చేసిన వ్యక్తులు పోలీసుల తనిఖీలకు భయపడి, తమ వాహనాలను నరసరావుపేట పోలీస్‌ స్టేషన్‌ వద్దే వదిలి వెళ్తున్నారు. ఇప్పటికే పోలీసులు 25 కార్లను స్వాధీనం చేసుకోగా, తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు కార్లను స్టేషన్‌ వద్ద వదిలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది.