News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News March 24, 2025
వికారాబాద్: 26న 148 వాహనాల వేలం

వికారాబాద్ జిల్లాలో ఈనెల 26న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గుర్తుతెలియని 148 వాహనాలకు వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాలలో ఏదైనా వాహనంపై ఎవరికైనా అభ్యంతరం, యాజమాన్య హక్కులు లేదా ఆసక్తి ఉంటే వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. SHARE IT.
News March 24, 2025
BREAKING: తండ్రైన స్టార్ క్రికెటర్

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరు సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ కారణంగానే ఇవాళ IPL మ్యాచ్‌కు రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్‌కు తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
News March 24, 2025
UPDATE: జాతరలో తప్పిపోయి.. శవమై కనిపించాడు

ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన జబ్బ సారంగం అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో మేడారం వచ్చాడు. దర్శనానికి వచ్చిన అనంతరం సారంగంకు మతిస్థిమితం లేకపోవడంతో తప్పిపోయాడని కుటుంబసభ్యులు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఎంత వెతికిన ఆచూకీ లభించలేదు. సోమవారం తాడ్వాయి మేడారం మధ్య అడవిలో మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు.