News November 13, 2024
ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
డిసెంబర్ 5న జరగనున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు ఏలూరు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం వివిధ రాజకీయ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళి పాటించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి 2659 మంది ఓటు హక్కు వియోగించుకోనున్నారు.
Similar News
News December 14, 2024
బియ్యం, కందిపప్పు, వంటనూనె ప్రత్యేక కౌంటర్లు కొనసాగించాలి: జేసీ
జిల్లాలో బియ్యం, కందిపప్పు, వంటనూనె ప్రత్యేక కౌంటర్లను మరికొంత కాలం కొనసాగించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని వ్యాపార సంఘాలు, కిరాణా వ్యాపారస్తులతో నిత్యవసర సరుకుల ధరలపై సమీక్ష నిర్వహించారు. తణుకు పట్టణంలో ప్రత్యేక కౌంటర్‌లో మినప్పప్పు కూడా హోల్‌సేల్ ధరలకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
News December 13, 2024
నరసాపురం: ‘డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్’
ఉన్నత న్యాయ స్థానాల ఆదేశాల మేరకు డిసెంబర్ 14వ తేదీన నరసాపురం కోర్ట్ సముదాయాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయదుర్గ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆయా కోర్టులలో ఉన్న రాజీపడతగిన అన్ని క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, సివిల్ భూ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు మొదలగునవి రాజీ చేసుకోవచ్చన్నారు
News December 13, 2024
పోక్సో నేరస్థుడికి జీవిత ఖైదు: ఎస్పీ
దెందులూరుకు చెందిన ఆంథోనీ రాజ్ (51)కు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జ్ సునంద శుక్రవారం తీర్పునిచ్చారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2022 అక్టోబరు 8 న గ్రామానికి చెందిన ఓ బాలికపై సదరు నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు నేరం రుజు కావడంతో జీవిత ఖైదు తో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ జడ్జ్ తీర్పునిచ్చారన్నారు.