News February 2, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు 23 పోలింగ్ కేంద్రాలు: భద్రాద్రి అ.కలెక్టర్

WGL-KMM-NLG టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శనివారం అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1949 మంది ఓటర్లకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో పురుషులు 1038, మహిళలు 911 మంది ఉన్నారన్నారు.
Similar News
News December 8, 2025
ఇంటి పేరు వద్దనుకున్న సమంత?

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన పేరును మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పేరు ‘సమంత రూత్ ప్రభు’ అని ఉంది. ఇటీవలే రాజ్ నిడిమోరును పెళ్లాడిన ఆమె తన పేరు పక్కన ఎవరి ఇంటి పేరును పెట్టుకునేందుకు ఇష్టపడట్లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. తన ఇంటి పేరును కూడా తొలగించి కేవలం ‘సమంత’ అనే బ్రాండ్ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. కాగా అంతకుముందు సమంత అక్కినేని అని ఉండేది.
News December 8, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్.. స్పెషల్ అట్రాక్షన్ ఇవే!

గ్లోబల్ సమ్మిట్లో 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, LED లేజర్ లైటింగ్, ఎయిర్పోర్ట్ బ్రాండింగ్ ఆకట్టుకోనుంది. MM కీరవాణి లైవ్ కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పెరిని, బోనాలు, బంజారా, కొమ్ము కోయ, కోలాటం, గుస్సాడి వంటి తెలంగాణ జనపద కళలు సందడి చేస్తాయి. తెలంగాణ చిరుతిళ్లు, HYD బిర్యానీ అతిథులను రంజింపజేస్తాయి. పొచంపల్లి ఇక్కత్, చెరియల్ ఆర్ట్, అత్తర్, ముత్యాల ప్రదర్శనకు రానున్నాయి.
News December 8, 2025
విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు ఇవాళ ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.


