News February 26, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతం చేద్దాం: వరంగల్ సీపీ

ఎన్నికల నిబంధనలను అమలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. ఎన్నికల సందర్బంగా సీపీ అధికారులతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నిఘా పెట్టాలని సీపీ అధికారులకు సూచించారు.
Similar News
News December 19, 2025
తూ.గో జిల్లాలో ఉద్యోగాలు.. 12 రోజులే గడువు!

రాజమండ్రిలోని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఛీఫ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జీ సునీత శుక్రవారం తెలిపారు. అర్హత కలిగిన న్యాయవాదులు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలు జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
News December 19, 2025
Unknown నంబర్ నుంచి వీడియో కాల్ చేసి..

అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన HYD వ్యక్తి బ్లాక్మెయిల్కు గురై ₹3.41L పోగొట్టుకున్నాడు. మహిళ వీడియో కాల్ చేసి అతడిని సెడ్యూస్ చేయగా, అది వైరల్ చేస్తామంటూ మరో వ్యక్తి బెదిరించాడు. పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. తన బ్యాంక్ అకౌంట్స్ హ్యాకవడం, మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
News December 19, 2025
GWL: విపత్తులు ఎదుర్కొనే అవగాహన కలిగి ఉండాలి-CS

వరదలు ప్రమాదాలతో పాటు వివిధ రకాల విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల యంత్రాంగానికి అవగాహన ఉండాలని సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు. NDMA డైరెక్టర్ సుధీర్ బాల్, టీజీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణ రావుతో కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గద్వాల జిల్లా యంత్రాంగం విపత్తుల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.


