News February 1, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్లతో సీఈఓ వీడియో సమావేశం

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. కలెక్టర్ తేజస్, అ.కలెక్టర్ పి. రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 9, 2025
నెల్లూరు : మాజీ ఛైర్మన్ ఇక లేరు

నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్, కొచ్చిన్, గోవా పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు పత్తి రవీంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పదవులను పొంది పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
News March 9, 2025
ఖమ్మం జిల్లాలో శనివారం 19,345 కేసుల పరిష్కారం

ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వరంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 19,345 కేసులు పరిష్కారమయ్యాయి. 62మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.2,71,77,000 నష్ట పరిహారాన్ని ఇప్పించారు. ప్రి-లిటిగేషన్ 18, క్రిమినల్ 643, సివిల్ 51, చెక్ 2,318, వివాహం 6, సైబర్ 78, ట్రాఫిక్ చలానాలు 16,169 పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయమూర్తి తెలిపారు.
News March 9, 2025
మంచిర్యాల జిల్లాలో శనివారం 6,200 కేసులు పరిష్కారం

మంచిర్యాల జిల్లా న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గంగా లోక్ అదాలత్ ద్వారా కోర్టు కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 6,200 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.1.20 లక్షలు, బ్యాంకు కేసుల్లో రూ.28 లక్షలు రికవరీ అయ్యాయని వివరించారు.