News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు పూర్తి అవగాహన కల్పించుకొని ఎన్నికల విధులను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. ఈ నెల 27న జిల్లాలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికలపై అధికారులకు రెండవ విడత శిక్షణ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్, మార్గదర్శకాలు సూచనలు తప్పక పాటించాలన్నారు.
Similar News
News November 4, 2025
రాష్ట్రం నుంచి ముగ్గురు.. అందులో ఇద్దరు మనోళ్లే

ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్‌పూర్లో ఈనెల 5 నుంచి 8వ తేది వరకు జరగనున్న నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్‌లో మహాదేవపూర్ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ బి.ప్రభాకర్ రెడ్డి, బాలికల పాఠశాల సైన్స్ టీచర్ మడక మధు పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 162 మంది సైన్స్ టీచర్లు కాన్ఫరెన్స్‌కు ఎంపికయ్యారు. కాగా, తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురిలో ఇద్దరు మన మహాదేవపూర్ ఉపాధ్యాయులే కావడం గర్వకారణం.
News November 4, 2025
Way2Newsలో కథనం.. స్పందించిన సూర్యాపేట హౌసింగ్ పీడీ

‘సూర్యాపేట కలెక్టరేట్‌లో కదలని ఇందిరమ్మ ఇండ్ల ఫైల్స్’ అనే శీర్షికతో Way2Newsలో OCT 22న కథనం ప్రచురితమైంది. హౌసింగ్ పీడీ సిద్ధార్థ్ స్పందించి చొరవ తీసుకోని జాజిరెడ్డిగూడెంకి చెందిన దివ్యాంగురాలు చనగాని లక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో మార్పులను సరిచేసి MPDOకు పంపించారు. గ్రామ సెక్రటరీ నవీన్ రెడ్డి మంజూరు పత్రాన్ని అందజేశారు. తన సమస్యను పరిష్కరించిన అధికారులకు లక్ష్మమ్మ కృతజ్ణతలు తెలిపారు.
News November 4, 2025
రోడ్ల నాణ్యతలో రాజీపడొద్దు: Dy.CM పవన్

AP: గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ‘సాస్కి’ పథకం ద్వారా సమకూర్చిన రూ.2 వేల కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘రహదారుల నాణ్యతలో రాజీపడొద్దు. అధికార యంత్రాంగానిదే బాధ్యత. ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నారో లేదో తనిఖీ చేయాలి. నేను, నిపుణులు క్షేత్రస్థాయిలో క్వాలిటీ చెక్ చేస్తాం’ అని చెప్పారు. రోడ్ల విషయంలో గత ప్రభుత్వం అలక్ష్యంతో వ్యవహరించిందని ఆరోపించారు.


