News February 25, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. 200 మంది పోలీస్ ఫోర్స్: ములుగు SP

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల వద్ద 200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, బూత్ వద్ద 100, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు.

Similar News

News March 26, 2025

పుట్టపర్తిలో జాయింట్ కలెక్టర్‌ను కలిసిన ఉషశ్రీ చరణ్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌ను సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కలిశారు. జిల్లాలో జరగనున్న ఎంపీపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె వినతి పత్రం అందించారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ZPTC పాలే జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

News March 26, 2025

డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి పనిచేస్తున్నాం: కలెక్టర్

image

పార్వతీపురం మ‌న్యం జిల్లాను డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి ప్రణాళికాబ‌ద్దంగా ప‌నిచేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.శ్యామ్ ప్ర‌సాద్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. 2వ రోజు జరిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో బుధవారం ఆయ‌న జిల్లా ప్ర‌గ‌తిపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో గిరిజ‌నలు ఎక్కువ‌గా ఉన్నార‌ని,కొండ ప్రాంతాల్లో ర‌హ‌దారి స‌దుపాయం లేక డోలీలు ఉప‌యోగిస్తున్నార‌ని అన్నారు.

News March 26, 2025

NGKL: గణితం పరీక్షకు 25 మంది గైర్హాజరు

image

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా బుధవారం 10వ తరగతి పరీక్షల్లో భాగంగా గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 10,560 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 10,535 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!