News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3 రోజులు మద్యం అమ్మకాలు బంద్

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు.
Similar News
News October 17, 2025
లిక్కర్ షాపులకు నో ఇంట్రెస్ట్!

TG: లిక్కర్ షాపుల దరఖాస్తులకు అనుకున్నంత స్పందన రావట్లేదు. గతంతో పోలిస్తే నిన్నటి వరకు 55% తక్కువ దరఖాస్తులు రావడంతో అప్లికేషన్లు సమర్పించాలని అబ్కారీ శాఖ వ్యాపారులకు SMSలు పంపుతోంది. ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. అలాగే గత మూడేళ్లతో పోల్చితే 2024లో అమ్మకాలు, లాభాలు తగ్గాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం.
*దరఖాస్తులకు రేపే చివరి తేదీ.
News October 17, 2025
విజయనగరం ఎంప్లాయిస్ గ్రీవెన్స్కు 27 ఫిర్యాదులు

కలెక్టరేట్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్లో 27 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ విభాగాలకు చెందిన ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. గత శుక్రవారం అందిన 40 ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
News October 17, 2025
నంద్యాల: ‘యువజన ఉత్సవాల్లో యువత పాల్గొనాలి’

యువజన ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా యువజన సంక్షేమ శాఖ–సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న నంద్యాల జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి యువజన ఉత్సవాలు అద్భుత వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.