News February 12, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్నవారికి క్యాజువల్ లీవ్: కలెక్టర్

ఈనెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News March 17, 2025
బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం

నాటుసారాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్లలో అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రత్యామ్నాయం మార్గాలను చూపిస్తామన్నారు.
News March 17, 2025
TG ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం: TTD

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని TTD నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలకు వీరిని అనుమతించనున్నారు. సోమ, మంగళ వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి ఇవ్వనుండగా, ఒక్కో లేఖపై ఆరుగురికి దర్శనం కల్పిస్తారు.
News March 17, 2025
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్? నిజమిదే!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలకు ఆయన టీమ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘మమ్ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. రంజాన్ కావడంతో ఉపవాసం చేస్తున్నారు. అందుకే సినిమా షూటింగ్స్‌నుంచి విరామం తీసుకున్నారు. ప్రచారంలో ఉన్నది పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేసింది. కాగా తన తర్వాతి సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో కలిసి నటించనుండటం విశేషం.