News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News October 27, 2025
ప్రకాశం జిల్లాలో ‘మొంథా’ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో?

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ చర్చ సాగుతోంది. ఓ వైపు అధికారులు తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఈ తుఫాన్ ప్రభావం సోమవారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో కనిపించే అవకాశం ఉంది. NDRF బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. ఏది ఏమైనా తుఫాన్ ఎఫెక్ట్ కాస్త తక్కువ ఉండేలా చూడు వరుణదేవా అంటూ ప్రజలనోట ఈ మాట వినిపిస్తోంది.
News October 27, 2025
‘సర్’లో ఏం చేస్తారు?

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై EC నేడు ప్రకటన చేయనుంది. తొలి విడతగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న TN, బెంగాల్, కేరళ, అస్సాం, పాండిచ్చేరిలో నవంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను తనిఖీ చేస్తారు. జాబితా ప్రకారం ఓటర్లు ఆ ఇంట్లో ఉన్నారా? లేరా? అని చెక్ చేస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, తప్పుల సవరణకు ఇది దోహదపడుతుందని EC చెబుతోంది.
News October 27, 2025
అన్నమయ్య: ఈ రెండు రోజులు జాగ్రత్త

అన్నమయ్య జిల్లాకు ఇవాళ్టి నుంచి తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు. అలాగే ఏవైనా సహాయ చర్యలు కావాల్సి ఉంటే 112 లేదా రాయచోటి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08561-293006 ఫోన్ చేయాలని ఎస్పీ ధీరజ్ సూచించారు. అలాగే వాగులు, వంకలు, నదులు, చెరువుల దగ్గరకు వెళ్లవద్దన్నారు.
>> SHARE IT


