News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. అదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించక కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News March 6, 2026
NZB: తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారు: ఈటెల

తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ శివారులోని కమ్మ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని అన్నారు. నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.
News March 6, 2026
తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: ఎంపీ అర్వింద్

నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ కమ్మ సంఘంలో శుక్రవారం బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమిపాలైన వారు నిరుత్సాహపడవద్దని, అది విజయానికి నాంది అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
News March 6, 2026
కమ్మర్‌పల్లి ప్రాంతంలో పులి సంచారం

మహారాష్ట్రలోని తాడోబా నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. బీట్ ఆఫీసర్ శ్రీదేవి ఈ పులిని ప్రత్యక్షంగా చూశారని తెలిసింది.


