News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ADB కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News February 19, 2025
వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

వికారాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. RTO ఆఫీస్ వద్ద ఆటో, కారు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒకరు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2025
గుంటూరు: ‘మరికొద్దిసేపట్లో మిర్చియార్డుకు జగన్’

వైసీపీ అధినేత జగన్ మరికొద్ది సేపట్లో ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డుకు రానున్నారు. ఓ పక్క ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, మరో పక్కన జగన్ గుంటూరు రాక నేపథ్యంలో నగరంలో రాజకీయం వేడెక్కింది. గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడటంతో పాటు వారి సమస్యలను తెలుసుకునే క్రమంలో జగన్ రహదారి మార్గంలో మిర్చియార్డుకు చేరుకోబోతున్నారు. అధినేత రాక కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.
News February 19, 2025
జగిత్యాల: గంజాయి సరఫరా.. ముగ్గురిపై కేసు నమోదు

గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తున్న సమాచారంతో దొంతాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నిశాంత్, కలువ గంగాధర్, ఎస్‌కే.ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 829 గ్రాముల గంజాయి దొరికినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.