News May 18, 2024
ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు CPI(M) మద్దతు!
ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి CPI(M) పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం అధికారిక ప్రకటన చేశారు. WGL-NLG-KMM ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలని CPI(M) నిర్ణయించిందని తెలిపారు. బిజెపిని ఓడించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించారు.
Similar News
News December 9, 2024
NLG: మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు!
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జిల్లాలోని మూడు పాత రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి విడతలో నల్గొండ, రెండో విడతలో మిర్యాలగూడ, ఆఖరి విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
News December 8, 2024
4 లైన్ల రోడ్లకు రూ.236 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుండి నార్కెట్ పల్లి- అద్దంకి -మెదర్ మెట్ల వరకు 236 కోట్ల రూపాయల వ్యయంతో 4లైన్ల నూతన సిసి రోడ్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ ద్వారా జి ఓఆర్ టి నంబర్ 926 జారీ చేసింది. వైటిపిఎస్ నుండి నామ్ రోడ్ వరకు 4 లైన్ల సిసి రోడ్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి NLG REPORT
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన రేవంత్.. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవాళ నల్గొండకు రానున్న రేవంత్ బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ప్రారంభం, నల్గొండలో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. ఏడాది పాలనపై మీ కామెంట్.