News February 20, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పోస్టుల భర్తీ: జెడ్పీ సీఈవో

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని జెడ్పీ సీఈవో ఎస్ వివివి.లక్ష్మణరావు పేర్కొన్నారు. మండపేట మండల పరిషత్ కార్యాలయాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం సందర్శించారు.  రికార్డులు పరిశీలించి,ఉద్యోగుల పనితీరును ఎంపీడీవో కే సత్యనారాయణ మూర్తిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 19, 2025

GHMC ఎన్నికల్లో జనసేన పోటీ!

image

తెలంగాణ రాజకీయాలపై జనసేన పార్టీ ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం వెల్లడించారు. కూకట్‌పల్లి నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో జనసేన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్‌గౌడ్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమీకరణపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

News November 19, 2025

కలెక్టర్‌కు మంత్రి వివేక్ సత్కారం

image

మంచిర్యాల జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జల్ సంచయ్ జన్ భగీదారి నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

News November 19, 2025

సంగారెడ్డి: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్

image

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు విజ్ఞాన భాండాగారాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.