News February 20, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పోస్టుల భర్తీ: జెడ్పీ సీఈవో

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని జెడ్పీ సీఈవో ఎస్ వివివి.లక్ష్మణరావు పేర్కొన్నారు. మండపేట మండల పరిషత్ కార్యాలయాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం సందర్శించారు. రికార్డులు పరిశీలించి,ఉద్యోగుల పనితీరును ఎంపీడీవో కే సత్యనారాయణ మూర్తిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 20, 2025
ధోనీయా మజాకా… యాడ్ వీడియో భారీ సక్సెస్

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన <<15801433>>యాడ్<<>> భారీ విజయం పొందిందని సదరు ఈ-సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ గుప్తా ట్వీట్ చేశారు. కేవలం 24 గంటల్లోనే యాడ్ వీడియోకు 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇది మాస్టర్ స్ట్రోక్ అని, వ్యూస్ పెరుగుతుండటం చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ లుక్‌లో తలా నటించిన విషయం తెలిసిందే.
News March 20, 2025
వరల్డ్ బెస్ట్ బ్రెడ్ మన ఇండియాదే!

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ మార్చి-2025 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో భారతదేశపు ‘బటర్ గార్లిక్ నాన్’ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రెడ్‌గా నిలిచింది. ఇది 4.7 రేటింగ్‌తో ప్రథమ ర్యాంకును పొందింది. ఆ తర్వాత అమృత్‌సర్‌కు చెందిన ‘కుల్చా’కు రెండు, పరోటాకు ఆరో స్థానం లభించింది. కాగా, 8వ ర్యాంకులో ‘నాన్’, 18లో ‘పరాఠా’, 26లో ‘భతురా’, 28లో ‘ఆలూ నాన్’, 35 ర్యాంకులో ‘రోటీ’ ఉన్నాయి.
News March 20, 2025
పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ప్రతీక్

పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి డీఈవో రేణుక దేవితో కలిసి కలెక్టర్ పరీక్షల నిర్వహణ అధికారులతో తహసీల్దారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎలాంటి మాస్ కాఫింగు అవకాశం లేకుండా చూడాలన్నారు.