News February 27, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం: MHBD కలెక్టర్

image

గురువారం జరగబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాద్ జిల్లాలోని ఫాతిమా హైస్కూల్ నుంచి జిల్లాలోని 16 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి, మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు కృష్ణవేణి గణేశ్ పాల్గొన్నారు.

Similar News

News March 24, 2025

దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి

image

కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే మీమ్‌ని ముంబై క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నిన్న జరిగిన MI-CSK మ్యాచ్‌లో దీపక్ 25పరుగులతో పాటు ఒక వికెట్ తీసి చెన్నైకు సులువుగా విజయం దక్కకుండా అడ్డుకున్నారు. గత 7 సీజన్లలో CSK జట్టులో ఉన్న దీపక్ ప్రస్తుతం ముంబై తరపున ఆడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆడిన జట్టుకు ద్రోహం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆమె ఫన్నీ మీమ్ షేర్ చేశారు.

News March 24, 2025

KG చికెన్‌కు రూ.10టాక్స్.. ఇదేనా విజన్: తాటిపర్తి

image

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరోసారి వ్యంగ్యంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘విజన్ -2047 అంటే KG చికెన్‌కు రూ.10 L&P టాక్స్ కట్టడం. L&P టాక్స్ ఎలా అమలు చేయాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కావాలంటే తెలుసుకోండి. భవిష్యత్‌లో ప్రతి కేజీ చికెన్‌పై దోపిడీకి జేబులు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు నా విన్నపం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News March 24, 2025

కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

image

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో 5 అమలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.

error: Content is protected !!