News January 30, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈనెల 29వ నుంచి ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కోడ్ పాటించాలని కలెక్టర్ సూచనలు చేశారు.
Similar News
News November 27, 2025
SRCL: ‘త్వరలోనే BRSను బొందపెడుతరు’

బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారని, తమ నాయకుడిని విమర్శించే స్థాయి వారికి లేదని లోకల్ బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. మాట్లాడాల్సిన వ్యక్తిని జర్మనీ పంపించి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా అని విమర్శించారు.
News November 27, 2025
నారాయణపేట జిల్లాలో 69 సర్పంచ్ నామినేషన్లు

నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో గురువారం 67 గ్రామ పంచాయతీలకు గాను, సర్పంచ్ పదవులకు 69 నామినేషన్లు, 572 వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కొత్తపల్లి మండలంలో సర్పంచ్ పదవులకు 26 నామినేషన్లు రాగా.. వార్డులకు 8 నామినేషన్లు వచ్చాయి. కోస్గిలో 19, 25, మద్దూరులో 16, 4, గుండుమల్లో 8, 1.. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి.
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?


