News February 20, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నిషేధాజ్ఞలు జారీ: కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్ట్యా కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి బుధవారం పలు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ఈ సమయంలో సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం, గుంపులుగా తిరగడం చేయరాదన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ కు వంద మీటర్ల లోపు ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడకూడదని హెచ్చరించారు.
Similar News
News March 24, 2025
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: DGP

AP: బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.
News March 24, 2025
యాదాద్రి: రూ.20 లక్షల స్కాలర్ షిప్

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి ఇన్‌ఛార్జి అధికారి వసంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందుతుందన్నారు.
News March 24, 2025
భూపాలపల్లి: వీణవంకలో 16టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుంచి కరీంనగర్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న 16టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున వీణవంక వద్ద పట్టుకున్నారు. లారీని అనుమానంతో ఆపి తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసిన పోలీసులు, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.