News February 8, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
₹7లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్.. కానీ!

ఝార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ <<19222430>>క్రాష్‌కు<<>> సంబంధించి హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో ఓనర్ సంజయ్ శరీరం 65% కాలిపోయింది. రాంచీలో చికిత్స ఫలితం ఇవ్వకపోవడంతో ఢిల్లీకి తరలించేందుకు కుటుంబసభ్యులు ₹7.5లక్షలు అప్పు చేసి మరీ ఎయిర్ అంబులెన్స్ మాట్లాడారు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి ఒకరిని కాపాడే ప్రయత్నంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
News February 24, 2026
మల్దకల్ మండలంలో చిరుత కలకలం

మల్దకల్ మండలం కుర్తిరావులచెరువు గ్రామ శివారులోని జామ తోటలో చిరుత అడుగుజాడలు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతవారం మద్దెలబండ తండాలో ఆవు, దూడను చిరుత చంపిన ఘటన మరువకముందే మళ్లీ అడుగుజాడలు బయటపడటంతో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News February 24, 2026
కేయూ పీజీ పరీక్షల సవరించిన టైమ్ టేబుల్ విడుదల

కాకతీయ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం (ప్రథమ సెమిస్టర్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల సవరించిన టైమ్‌టేబుల్ విడుదలైంది. పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 18 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. పరీక్షా ప్రాంగణంలో సెల్‌ఫోన్లు పూర్తిగా నిషేధించారు.


