News February 9, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ
ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేశ్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 10, 2025
కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.
News February 10, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. అప్డేట్
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు మొత్తం గ్రాడ్యుయేట్ నామినేషన్లు- 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు- 17 దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి వెల్లడించారు. ఇందులో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాఖలైన నామినేషన్లు- 51, టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్లు- 8 వచ్చాయని తెలిపారు. కాగా.. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది.
News February 10, 2025
గీసుగొండలో గంజాయి చాక్లెట్ల కలకలం..
గీసుగొండ మండలంలో గంజాయి చాక్లెట్ల వార్త కలకలం రేపింది. సీఐ మహేందర్ తెలిపిన వివరాలిలా.. టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న ముగ్గురు యువకుల వద్ద గంజాయి చాక్లెట్లు ఉన్నాయని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ముగ్గురు యువకులు పారిపోవడానికి యత్నించారు. వారిని వెంబడించి పట్టుకోగా 12 గంజాయి చాక్లెట్లు లభించాయన్నారు. వారిని కస్టడీలోకి తీసుకున్నామని CI తెలిపారు.